నేషనల్

  • రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో భారీ మార్పులు..

    రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో భారీ మార్పులు..

    రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో బ్రాండ్‌పై నమ్మకమే అత్యంత కీలకమని M5 మహేంద్ర గ్రూప్ AVP మార్కెటింగ్ రాహుల్ ధార్ అన్నారు. ప్రస్తుతం ఇంటి కొనుగోలుదారులు సైట్ విజిట్‌కు వెళ్లే ముందే ప్రాజెక్టులు, డెవలపర్లు, RERA వివరాలు, ఫ్లోర్ ప్లాన్స్, ఆన్‌లైన్ రివ్యూలను పరిశీలిస్తున్నారని తెలిపారు. గతంలో సైట్ విజిట్ కొనుగోలు నిర్ణయానికి ప్రారంభ దశగా ఉండేదని, ఇప్పుడు అది తుది దశగా మారిందన్నారు. కొనుగోలుదారుడి నిర్ణయంలో 70–80 శాతం భాగం సైట్ విజిట్‌కు ముందే పూర్తవుతోందని పేర్కొన్నారు. అందువల్ల డిజిటల్ మార్కెటింగ్‌తో పాటు పారదర్శకత, నాణ్యమైన కస్టమర్ అనుభవం, సమయానికి ప్రాజెక్ట్ డెలివరీపై డెవలపర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఒక్క ప్రతికూల రివ్యూ కూడా బ్రాండ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.

    Sandhya B Avatar
  • ఢిల్లీలో రూ.1,941 కోట్ల రోడ్డు ప్రాజెక్టులు.. బరాపుల్లా ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభం

    ఢిల్లీలో రూ.1,941 కోట్ల రోడ్డు ప్రాజెక్టులు.. బరాపుల్లా ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభం

    ఢిల్లీలో భారీ రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రహోంమంత్రి అమిత్ షా రూ.1,941 కోట్ల విలువైన నాలుగు రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బరాపుల్లా ఫేజ్-3 ఎలివేటెడ్ కారిడార్ ప్రధానమైనది. ఈ కారిడార్ మయూర్ విహార్ ఫేజ్-1 నుంచి సరాయ్ కాలే ఖాన్ మీదుగా దక్షిణ ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రాంతానికి సిగ్నల్-ఫ్రీ కనెక్టివిటీ అందించనుంది. సుమారు 9 కిలోమీటర్ల మార్గం తూర్పు, దక్షిణ ఢిల్లీ మధ్య రాకపోకలను మెరుగుపరచనుంది. అలాగే ముకర్బా చౌక్ అండర్‌పాస్‌ను ప్రారంభించగా, మోదీ మిల్-కాళ్కాజీ ఫ్లైఓవర్ విస్తరణ, సావిత్రి సినిమా సమీపంలో కొత్త ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులతో ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది.

    Sandhya B Avatar
  • ఎక్స్‌ప్రెస్‌వేల వెంట కొత్త రియల్ ఎస్టేట్ కారిడార్లు.. చిన్న నగరాల్లో వేగంగా అభివృద్ధి

    ఎక్స్‌ప్రెస్‌వేల వెంట కొత్త రియల్ ఎస్టేట్ కారిడార్లు.. చిన్న నగరాల్లో వేగంగా అభివృద్ధి

    దేశంలోని చిన్న నగరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కొత్త దిశగా సాగుతోంది. ఎక్స్‌ప్రెస్‌వేలు, మెరుగైన రహదారి కనెక్టివిటీ కారణంగా నగర శివారు ప్రాంతాల్లో భూములు, నివాస ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోంది. డెవలపర్లు ప్లాటెడ్ డెవలప్‌మెంట్లు, రెసిడెన్షియల్, మిక్స్‌డ్‌-యూజ్ ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు.మెరుగైన రవాణా సౌకర్యాలతో కొత్త ప్రాంతాల్లో ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రిటైల్ మార్కెట్లు, హోటళ్లు, గోదాములు వంటి వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి. దీంతో ఇవి భవిష్యత్‌ పట్టణ కేంద్రాలుగా మారే అవకాశం ఉంది.అయితే కేవలం ఎక్స్‌ప్రెస్‌వే ఆధారంగా పెట్టుబడి పెట్టకుండా నీరు, విద్యుత్, ప్రజా రవాణా, ఉద్యోగ అవకాశాలు, విద్యా-వైద్య సదుపాయాలు, ప్రభుత్వ అనుమతులను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

    Sandhya B Avatar
  • హైదరాబాద్‌కు సమీపంలో రూ.400 కోట్ల భారీ డెయిరీ ప్లాంట్

    హైదరాబాద్‌కు సమీపంలో రూ.400 కోట్ల భారీ డెయిరీ ప్లాంట్

    తెలంగాణలో పాడి పరిశ్రమకు భారీ ఊతం లభించనుంది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో అమూల్ సంస్థ రూ.400 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక డెయిరీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.సాబర్ డెయిరీ తెలంగాణ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఈ ప్లాంట్‌ను సుమారు 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్లాంట్ అందుబాటులోకి వస్తే స్థానిక పాడి రైతులకు పాల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ లభించడంతో పాటు యువత, మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. తెలంగాణలో పాడి పరిశ్రమ, సహకార సంఘాల బలోపేతానికి ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.

    Sandhya B Avatar
  • తెలంగాణలో అపార్ట్‌మెంట్లకు ఫైర్ NOC నిబంధనల్లో కీలక మార్పు

    తెలంగాణలో అపార్ట్‌మెంట్లకు ఫైర్ NOC నిబంధనల్లో కీలక మార్పు

    తెలంగాణలో కొత్తగా నిర్మించే నివాస అపార్ట్‌మెంట్లకు ఫైర్ NOC నిబంధనల్లో కీలక మార్పు వచ్చింది. ప్రొవిజనల్ ఫైర్ NOC అవసరమయ్యే కనీస భవన ఎత్తును 18 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచారు. ఈ మార్పు అక్టోబర్ 7 నుంచి అమల్లోకి రానుంది. దీంతో 18–24 మీటర్ల ఎత్తు ఉన్న సుమారు 5–7 అంతస్తుల నివాస భవనాలకు కేవలం ఎత్తు కారణంగా ప్రొవిజనల్ NOC అవసరం ఉండదు. ఈ సడలింపు పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, కార్యాలయాలు, వాణిజ్య భవనాలకు వర్తించదు. అయితే NOC అవసరం లేకపోయినా ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సురక్షిత మెట్లు, ఎమర్జెన్సీ లైటింగ్, ఫైర్ అలారాలు, ఎక్స్‌టింగ్విషర్లు వంటి ఏర్పాట్లు ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

    Sandhya B Avatar
  • అఫర్డబుల్‌ హౌసింగ్‌పై కేంద్రం కొత్త విధానం.. రూ.45 లక్షల పరిమితి తొలగించే అవకాశం

    అఫర్డబుల్‌ హౌసింగ్‌పై కేంద్రం కొత్త విధానం.. రూ.45 లక్షల పరిమితి తొలగించే అవకాశం

    దేశంలో అందుబాటు గృహాల (Affordable Housing) రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు క్రెడాయ్ తెలిపింది. రాబోయే ఆరు నెలల్లో ప్రస్తుత నిబంధనల్లో మార్పులు రావచ్చని పేర్కొంది. ప్రస్తుతం మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు, ఇతర నగరాల్లో 90 చదరపు మీటర్ల వరకు ఉన్న ఇళ్లకు రూ.45 లక్షల ధర పరిమితి ఉంది. ఈ పరిమితిని తొలగించి ఇంటి విస్తీర్ణాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని క్రెడాయ్ కోరుతోంది. భూమి ధరలు, నిర్మాణ వ్యయాలు, పన్నులు, అనుమతుల జాప్యాన్ని తగ్గిస్తే మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు సరసమైన ఇళ్ల సరఫరా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రతిపాదనపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

    Sandhya B Avatar
  • 22A భూముల సమస్యలకు పరిష్కారం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    22A భూముల సమస్యలకు పరిష్కారం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుదారులు, ఆస్తిదారులకు శాశ్వత ఉపశమనం కలిగించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో సమగ్రమైన కార్యాచరణను రూపొందించారు. నాన్-అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్ అనుమతి లేకుండానే ఇప్పటికే నివాస స్థలాలుగా, ఇళ్లుగా మారిన పట్టా భూములకు అధికారికంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు వీలుగా నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు.ఈ నిర్ణయం అమలు కోసం నిర్దేశిత నాలా రుసుము చెల్లించిన అర్హత గల భూములు, ప్లాట్లు, ఇళ్లకు వేగంగా రిజిస్ట్రేషన్(Telangana Govt) ప్రాసెస్ పూర్తి చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. GHMC, HMDA, DTCP, వివిధ మున్సిపాలిటీల ఆమోదం పొందిన 22A పరిధిలోని ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల యజమానులకు నేరుగా రిజిస్ట్రేషన్ హక్కులు లభిస్తాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా నానబెడుతూ వచ్చిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులను కూడా పరిరిష్కరించేలా స్పష్టమైన…

    Sandhya B Avatar
  • రూ.10 లక్షల వార్షిక ఆదాయంతో హై-రైజ్ ఫ్లాట్ కొనొచ్చా?

    రూ.10 లక్షల వార్షిక ఆదాయంతో హై-రైజ్ ఫ్లాట్ కొనొచ్చా?

    ఏటా 10 లక్షలు సంపాదించే ఏకైక సంపాదనపరుడు ఉన్న కుటుంబానికి నగర పరిధిలోని హైరైజ్ ఫ్లాట్ ఆర్థికంగా ప్రతికూలమనే చెప్పాలి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ, ఉమ్మడి కుటుంబ ఆదాయం 18-20 లక్షలు దాటితే హైరైజ్ ఫ్లాట్లు సురక్షితమైన ఎంపిక అవుతాయి. అలా కాని పక్షంలో, 10 లక్షల ఆదాయం ఉన్నవారు తమ బడ్జెట్‌కు తగినట్లుగా నగర శివార్లలో , టైర్-2 నగరాల్లో వచ్చే సాధారణ అపార్ట్‌మెంట్లు , అప్రూవ్డ్ ఆన్-గోయింగ్ వెంచర్లలో ప్లాట్లను ఎంచుకోవడమే ఆర్థిక క్రమశిక్షణకు, ప్రశాంతమైన జీవనానికి అనుకూలమైన మార్గం. నగరంలోని 2BHK, 3BHK ఫ్లాట్ల ధరలు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఉన్నాయి. రూ.10 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి నెలకు రూ.55,000–70,000 వరకు EMI చెల్లించే సామర్థ్యం ఉంటే రూ.60–80 లక్షల విలువైన ఫ్లాట్‌ను పరిశీలించవచ్చు. అయితే EMI ఆదాయంలో 40 శాతానికి మించకుండా చూసుకోవాలి. డౌన్ పేమెంట్‌తో పాటు…

    Sandhya B Avatar
  • రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో డేటా, టెక్నాలజీ కీలకం

    రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో డేటా, టెక్నాలజీ కీలకం

    భారత రియల్ ఎస్టేట్ పెట్టుబడి నిర్ణయాల్లో డేటా, టెక్నాలజీ ప్రాధాన్యం వేగంగా పెరుగుతోంది. Arbour సంస్థ వ్యవస్థాపకుడు చిరాగ్ మెహతా ప్రకారం, వారి Arbour Investment and Monitoring System (AIMS) పెట్టుబడికి ముందు ప్రాజెక్టులను 350కి పైగా ప్రమాణాలతో పరిశీలిస్తుంది. ఇందులో భూమి హక్కులు, అనుమతులు, నిర్మాణ వ్యయం, మార్కెట్ డిమాండ్, డెవలపర్ సామర్థ్యం, ప్రాజెక్ట్ నగదు ప్రవాహాలు వంటి అంశాలు ఉంటాయి. భారత నిర్మాణ ప్రాజెక్టుల్లో సుమారు 46% ఆలస్యమవుతున్నాయని, 2025 చివరికి ఖర్చు అధికం రూ.5.42 లక్షల కోట్లుగా నమోదైందని పేర్కొంది. పెట్టుబడి తర్వాత కూడా అమ్మకాలు, నిర్మాణ పురోగతి, ఖర్చులు, అనుమతులు, కలెక్షన్లను డేటా ఆధారంగా పర్యవేక్షించడం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. టెక్నాలజీ రిస్క్‌ను తొలగించకపోయినా, పెట్టుబడి నిర్ణయాలను మరింత పారదర్శకంగా, పద్ధతిగా మార్చగలదు.

    Sandhya B Avatar
  • ₹32,000 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. అమరావతికి గిరిజన ప్రాంతాల అనుసంధానం

    ₹32,000 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. అమరావతికి గిరిజన ప్రాంతాల అనుసంధానం

    ఆంధ్రప్రదేశ్‌లో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సుమారు ₹32,000 కోట్ల అంచనా వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ నుంచి అమరావతి వరకు ఈ హైవే నిర్మాణం చేపట్టనుండగా, మొత్తం పొడవు 1,107 కి.మీ.గా ఉండనుంది. ఇందులో సుమారు 457 కి.మీ. ఏపీలో, దాదాపు 200 కి.మీ. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటుంది. అరకు, పాడేరు, చింతపల్లి, కొయ్యూరు తదితర గిరిజన ప్రాంతాలను కలుపుతూ ఈ మార్గం సాగుతుంది. ప్రాజెక్టుతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో కనెక్టివిటీ, వాణిజ్యం, ఆర్థికాభివృద్ధి మెరుగుపడే అవకాశం ఉంది.

    Sandhya B Avatar