లేటెస్ట్ సిటీ న్యూస్

  • హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో వింత ట్రెండ్

    హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో వింత ట్రెండ్

    హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గుతున్నప్పటికీ ఇళ్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. క్రెడాయ్–క్రెమెట్రిక్స్ తాజా నివేదిక ప్రకారం, గత నాలుగేళ్లలో హైదరాబాద్‌లో నివాస గృహాల అమ్మకాలు 13 శాతం తగ్గాయి. అయితే సగటు ఇంటి ధర రూ.2 కోట్ల మార్కును దాటింది. ఐటీ రంగంలోని ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడిదారుల వేచి చూసే ధోరణి వంటి అంశాలు కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు భూముల ధరలు, నిర్మాణ వ్యయాలు పెరగడంతో ఇళ్ల ధరలు తగ్గడం లేదు. దీంతో హైదరాబాద్‌లో సొంతింటి కొనుగోలు మరింత ఖరీదుగా మారుతోంది.

    Sandhya B Avatar

  • పెరిగిన వైట్ కాలర్ జాబ్స్.. హైదరాబాద్‌లో 23% వృద్ధి

    పెరిగిన వైట్ కాలర్ జాబ్స్.. హైదరాబాద్‌లో 23% వృద్ధి

    దేశవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు ఆగస్టులో 14 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఉద్యోగ నియామకాలలో హైదరాబాద్ 23 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. నౌకరి.కామ్ నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో టెక్, ఐటీ, ఇంజినీరింగ్, బిజినెస్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే నగరంలో జాబ్ మార్కెట్ గణనీయంగా మెరుగుపడింది. బెంగళూరు, పుణె, ముంబై వంటి ప్రధాన నగరాల్లోనూ వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు పెరిగాయి. హైదరాబాద్‌లో పెరుగుతున్న ఐటీ కార్యకలాపాలు, కొత్త కంపెనీల విస్తరణ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) పెరుగుదల ఉద్యోగ మార్కెట్‌కు మద్దతు ఇస్తున్నాయి. దీంతో నగరంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు డిమాండ్ మరింత పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

    Sandhya B Avatar

  • ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి రూ.140 కోట్లు

    ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి రూ.140 కోట్లు

    హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.140 కోట్లు మంజూరు చేసింది.ఫ్యూచర్‌ సిటీని ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడంతో పాటు మెరుగైన రహదారులు, కనెక్టివిటీ, పట్టణ సదుపాయాల కల్పనపై దృష్టి సారించనున్నారు. భవిష్యత్‌లో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను ఆకర్షించేలా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఫ్యూచర్‌ సిటీ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు, మౌలిక వసతులు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. హైదరాబాద్‌ భవిష్యత్‌ వృద్ధిలో ఫ్యూచర్‌ సిటీ కీలక ప్రాంతంగా మారనుంది.

    Sandhya B Avatar

  • రూ.37 కోట్లతో రేడియల్ రోడ్డు.. ఐటీ కారిడార్‌కు భారీ ఊరట

    రూ.37 కోట్లతో రేడియల్ రోడ్డు.. ఐటీ కారిడార్‌కు భారీ ఊరట

    హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు మరో కీలక రహదారి అందుబాటులోకి రానుంది. రూ.37 కోట్ల వ్యయంతో రేడియల్‌ రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. గోపన్‌పల్లి నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) వరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే భూసేకరణ, ఇతర పనులపై అధికారులు దృష్టి సారించారు. ఈ రోడ్డు పూర్తయితే ఐటీ కారిడార్‌లో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాలపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

    Sandhya B Avatar

  • కోకాపేట భూమి వేలం రద్దు.. మళ్లీ మొదటికి!

    కోకాపేట భూమి వేలం రద్దు.. మళ్లీ మొదటికి!

    హైదరాబాద్‌ కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లోని ప్లాట్ నంబర్ 17లోని 4.59 ఎకరాల భూమి వేలం మళ్లీ వాయిదా పడింది. సింగిల్ బిడ్ మాత్రమే రావడంతో హెచ్‌ఎండీఏ వేలాన్ని రద్దు చేసింది. గతంలోనూ ఈ భూమికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో మరోసారి వేలం నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కోకాపేటలో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు, భారీ వాణిజ్య, నివాస ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ భూమి వేలంపై ఆసక్తి నెలకొంది.

    Sandhya B Avatar

  • కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే.. రూ.1,000 కోట్ల వరకు ఆదా!

    కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే.. రూ.1,000 కోట్ల వరకు ఆదా!

    హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు కొత్త పరిష్కారం ప్రతిపాదించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేటీఆర్ పార్క్ ఎంట్రెన్స్, రోడ్ నంబర్లు 2, 45, 82, 12, 10 ప్రాంతాల్లో నిర్మించాలనుకున్న ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లను రద్దు చేసే ప్రతిపాదన ఉంది. వాటికి బదులుగా ఒకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నారు. రీ-అలైన్‌మెంట్‌తో భూసేకరణ అవసరమయ్యే ఆస్తులు 453 నుంచి 100లోపుకు తగ్గే అవకాశం ఉంది. దీంతో భూసేకరణ వ్యయంలో భారీగా తగ్గుదలతో రూ.1,000 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    Sandhya B Avatar

  • శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో హైస్పీడ్ హౌటళ్లకు ఊతం

    శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో హైస్పీడ్ హౌటళ్లకు ఊతం

    శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో హైస్పీడ్ హోటళ్ల నిర్మాణం వేగం పుంజుకుంటోంది. ఒబెరాయ్, వెస్టిన్ వంటి ప్రముఖ హోటల్స్ సంస్థలు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి తర్వాత శంషాబాద్ ప్రాంతం కూడా హైదరాబాద్‌లో కీలక హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ హబ్‌గా ఎదుగుతోంది. విమానాశ్రయానికి సమీపంలో భారీ స్థాయిలో హోటల్ ప్రాజెక్టులు రావడంతో స్థానికంగా భూముల విలువలు, వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రయాణికులు, కార్పొరేట్ వినియోగదారులకు అనుగుణంగా కొత్త హోటల్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

    Sandhya B Avatar

  • హైదరాబాద్‌లో కొత్త ఎలివేటెడ్ కారిడార్

    హైదరాబాద్‌లో కొత్త ఎలివేటెడ్ కారిడార్

    హైదరాబాద్‌లో కీలక ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కొత్త ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి ఎమ్మెల్యే కాలనీ మీదుగా షేక్‌పేట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ మార్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు రాకపోకలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఉంది. ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు పరిమిత భూసేకరణ మాత్రమే అవసరమయ్యే అవకాశం ఉంది. కీలక నగర మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడనుంది.

    Sandhya B Avatar

  • హైదరాబాద్‌కు మరో కీలక రహదారి.. 81 కి.మీ రేడియల్ రోడ్-2

    హైదరాబాద్‌కు మరో కీలక రహదారి.. 81 కి.మీ రేడియల్ రోడ్-2

    హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ (HGCL) ఆధ్వర్యంలో 81.15 కి.మీ రేడియల్‌ రోడ్‌-2 (RR-2) నిర్మాణానికి పనులు ప్రారంభం కానున్నాయి. కోత్వాల్‌గూడ ORR నుంచి బుడ్వేల్‌ మీదుగా నాచారం, కోడంగల్‌ సమీపంలోని NH-167N వరకు ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. రూ.3,295 కోట్లకు పైగా అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీలుగా పనులు చేపట్టనున్నారు. ఈ రహదారి రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల మీదుగా సాగుతుంది. భారీ సరుకు రవాణా, పారిశ్రామిక ట్రాఫిక్‌ను హైదరాబాద్‌ నుంచి మళ్లించి ORRకు నేరుగా అనుసంధానం చేయడం దీని ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో మెట్రో కారిడార్‌కు వీలుగా రహదారి మధ్యలో స్థలం కేటాయించనున్నారు.

    Sandhya B Avatar

  • హైదరాబాద్ రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శంకుస్థాపన

    హైదరాబాద్ రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శంకుస్థాపన

    హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో కీలక ముందడుగు పడనుంది. రాయదుర్గం ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మల్కం చెరువు వెనుక ఉన్న 2.85 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 480 ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ టవర్స్‌ నిర్మాణం పూర్తయితే ఎంపికైన లబ్ధిదారులకు మెరుగైన నివాస సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. శంకుస్థాపన కార్యక్రమానికి లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ నిర్మాణం హైదరాబాద్‌ నగరంలో అందుబాటు గృహాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే మరో ప్రాజెక్టుగా నిలవనుంది.

    Sandhya B Avatar