ఆంధ్రప్రదేశ్‌లో PMAY-U 2.0 పథకం కింద 17,912 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాలకు రూ.447.80 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ఈ ఇళ్లను నిర్మించనున్నారు.
ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షల యూనిట్ వ్యయం కాగా, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష చొప్పున అందించనున్నాయి. నిర్ణీత మొత్తానికి మించి అయ్యే అదనపు నిర్మాణ ఖర్చును లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది.
లబ్ధిదారుల ఎంపిక, నిధుల పంపిణీ, నిర్మాణ పర్యవేక్షణను ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్వహించనుంది. స్థానిక పట్టణ సంస్థలు ధృవీకరణ, నిబంధనల అమలులో సహకరించనున్నాయి.

