2047 నాటికి భారత GDPలో రియల్ ఎస్టేట్ వాటా 20 శాతానికి చేరొచ్చు

2047 నాటికి భారత GDPలో రియల్ ఎస్టేట్ వాటా 20 శాతానికి చేరొచ్చు

న్యూఢిల్లీ: 2047 నాటికి భారత GDPలో రియల్ ఎస్టేట్ రంగం వాటా 15-20 శాతానికి పెరగొచ్చని Knight Frank సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు. ప్రస్తుతం ఈ రంగం సుమారు 8-9 శాతం GDPకి, దాదాపు 600 బిలియన్ డాలర్ల విలువకు చేరిందన్నారు. ఆర్థిక వ్యవస్థ విస్తరణతో 2047 నాటికి భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 8-10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు. అయితే అందుబాటు ధరల గృహాలు, మూలధన లభ్యత ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఆఫీస్ స్పేస్, GCCలు, వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్, విద్య, ఆరోగ్య రంగాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతోందన్నారు.

Did you find this post helpful?
 0 0
50%
50%