లీగల్ అప్డేట్లు

  • కూతురి ఆస్తి హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు

    కూతురి ఆస్తి హక్కులపై సుప్రీంకోర్టు తీర్పు

    వివాహమైన కూతురికి పూర్వీకుల ఆస్తిలో హక్కు ఉంటుందా? స్వార్జిత ఆస్తిపై ఆమెకు ఎలాంటి హక్కులు వర్తిస్తాయి? ఈ అంశాలపై సుప్రీంకోర్టు తీర్పు కీలక స్పష్టతను ఇచ్చింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం, పూర్వీకుల ఆస్తిలో కూతురికి కుమారుడితో సమాన హక్కులు ఉంటాయి. ఆమె వివాహం జరిగినా ఈ హక్కు తొలగిపోదు. అయితే తల్లిదండ్రులు స్వయంగా సంపాదించిన ఆస్తి విషయంలో వారి వీలునామా, ఆస్తి బదలాయింపు వంటి అంశాలు కీలకం. అందువల్ల పూర్వీకుల ఆస్తి, స్వార్జిత ఆస్తి మధ్య తేడాను తెలుసుకోవడం అవసరం. ఆస్తి వివాదాల్లో చట్టపరమైన పత్రాలు, కుటుంబ పరిస్థితులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

    Sandhya B Avatar
  • అనుభవదారు హక్కుదారు కాలేడు.. భూమి యాజమాన్యంపై హైకోర్టు కీలక తీర్పు

    అనుభవదారు హక్కుదారు కాలేడు.. భూమి యాజమాన్యంపై హైకోర్టు కీలక తీర్పు

    రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారుగా నమోదైనంత మాత్రాన భూమిపై యాజమాన్య హక్కులు రావని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అధికారిక నివేదికలు, అఫిడవిట్ల ఆధారంగా భూమి యాజమాన్యాన్ని నిర్ధారించలేమని పేర్కొంది. భూమిపై అసలు యాజమాన్య హక్కులను తేల్చే అధికారం సివిల్ కోర్టుకే ఉందని తెలిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం చినరావల్పల్లిలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ భూముల వివాదంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పట్టాదారు, అనుభవదారు మధ్య తేడా ఉంటుందని, కేవలం భూమిని అనుభవిస్తున్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదవడం యాజమాన్యానికి ఆధారం కాదని హైకోర్టు పేర్కొంది.

    Sandhya B Avatar
  • 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. డెవలపర్‌ రూ.37.76 లక్షలు వాపసు

    20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. డెవలపర్‌ రూ.37.76 లక్షలు వాపసు

    హర్యానాలోని సోనిపట్‌ కుండ్లీ ప్రాంతంలో 350 చదరపు గజాల ప్లాట్ కోసం 2006లో రూ.37.76 లక్షలు చెల్లించిన కొనుగోలుదారుడికి దాదాపు 20 ఏళ్లుగా స్థలం అప్పగించలేదు. పలుమార్లు విజ్ఞప్తులు, న్యాయ నోటీసు ఇచ్చినా డెవలపర్‌ ప్లాట్‌ స్వాధీనం ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ డెవలపర్‌ సేవల్లో లోపం ఉందని పేర్కొంది. దీంతో రూ.37,76,700ను 6 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మానసిక వేదన, వేధింపులు, న్యాయ ఖర్చుల కోసం మరో రూ.1 లక్ష చెల్లించాలని స్పష్టం చేసింది.

    Sandhya B Avatar
  • సహ యజమాని ఆస్తిని ప్రత్యేకంగా అనుభవిస్తే ‘ఔస్టర్’గా పరిగణించవచ్చు: మద్రాస్ హైకోర్టు

    సహ యజమాని ఆస్తిని ప్రత్యేకంగా అనుభవిస్తే ‘ఔస్టర్’గా పరిగణించవచ్చు: మద్రాస్ హైకోర్టు

    సహ యజమానుల్లో ఒకరు ఆస్తిని దీర్ఘకాలంగా ప్రత్యేకంగా స్వాధీనంలో ఉంచుకుని, దాని ద్వారా వచ్చే అద్దె లేదా ఆదాయాన్ని స్వయంగా పొందుతున్నట్లయితే, ఇతర సహ యజమానులను ఆస్తి నుంచి తప్పించినట్లు (Ouster) కోర్టు భావించవచ్చని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.జస్టిస్ జి. జయచంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎం. పాండియరాజన్ కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఆస్తి విభజన కోరిన ఇద్దరు మహిళలకు సంబంధించిన కేసులో, వారు 40 ఏళ్లకు పైగా ఆస్తిని సంయుక్తంగా అనుభవించలేదని కోర్టు గమనించింది. అలాగే, కొన్ని ఆస్తుల వివరాలు తప్పుగా పేర్కొనడం, అవసరమైన వారిని కేసులో చేర్చకపోవడం వంటి అంశాలు కూడా ‘ఔస్టర్’ వాదనకు బలం చేకూర్చాయని పేర్కొంది.

    Sandhya B Avatar
  • వక్ఫ్ భూములపై కీలక తీర్పు.. యాజమాన్యాన్ని నిరూపించాల్సిందే: తెలంగాణ హైకోర్టు

    వక్ఫ్ భూములపై కీలక తీర్పు.. యాజమాన్యాన్ని నిరూపించాల్సిందే: తెలంగాణ హైకోర్టు

    వక్ఫ్ ఆస్తిగా భూమిని ప్రకటించినప్పుడు దానికి సంబంధించిన సర్వే, విచారణ రికార్డులను వక్ఫ్ బోర్డు సమర్పించాల్సిందే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తూప్రాన్‌లోని సర్వే నంబర్లు 893, 894, 895, 896, 897 తదితర భూములను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. భూ యజమానులు పట్టాదారు పాస్‌బుక్‌లు, రెవెన్యూ రికార్డులు, టైటిల్ డీడ్లు ఉన్నాయని తెలిపారు. అయితే, వక్ఫ్ బోర్డు సర్వే, విచారణ, అభ్యంతరాలు, ప్రజలకు నోటీసులిచ్చినట్లు ఆధారాలను సమర్పించలేకపోయింది. దీంతో 2001 గెజిట్ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది.

    Sandhya B Avatar
  • ప్రీమియం FARతో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించొద్దు: సుప్రీంకోర్టు

    ప్రీమియం FARతో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించొద్దు: సుప్రీంకోర్టు

    ప్రీమియం FAR (Floor Area Ratio)ను ఉపయోగించి అనధికార నిర్మాణాలను క్రమబద్ధీకరించరాదని సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రీమియం FAR పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ చట్టంలోని సెక్షన్ 18-B కింద అదనపు నిర్మాణ విస్తీర్ణాన్ని ప్రీమియం చార్జీల చెల్లింపుతో పొందే విధంగా ఈ పథకం ఉంది. అయితే, ఈ విధానాన్ని అనధికార నిర్మాణాల రెగ్యులరైజేషన్‌కు ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. పథకం కింద మంజూరు చేసే FARపై తుది తీర్పు ప్రభావం ఉంటుందని పేర్కొంది.

    Sandhya B Avatar
  • ఆలస్యంగా ఫ్లాట్ అప్పగించినా వడ్డీ కోరొచ్చు: అలహాబాద్ హైకోర్టు

    ఆలస్యంగా ఫ్లాట్ అప్పగించినా వడ్డీ కోరొచ్చు: అలహాబాద్ హైకోర్టు

    ఫ్లాట్‌ను ఆలస్యంగా స్వీకరించినంత మాత్రాన ఆలస్యమైన స్వాధీనం (Delayed Possession)పై వడ్డీ కోరే హక్కును కోల్పోరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. నోయిడాలోని అన్ట్రిక్ష్ గోల్ఫ్ వ్యూ ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో ఈ తీర్పు వెలువడింది. 2010లో ఫ్లాట్ బుక్ చేసిన కొనుగోలుదారుడికి 2012 నవంబర్‌లోగా స్వాధీనం ఇవ్వాల్సి ఉండగా, 2017లో అప్పగించారు. ఆలస్య కాలానికి వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. RERA కింద ఆలస్య స్వాధీనం వడ్డీకి ప్రత్యేక పరిమితి కాలం లేదని కూడా కోర్టు పేర్కొంది. NGT ఆంక్షల కారణంగా ఆలస్యం జరిగిందన్న డెవలపర్ వాదనను కోర్టు తిరస్కరించింది.

    Sandhya B Avatar
  • భూమి కొనుగోలు చేయని సొసైటీపై RERA ఫిర్యాదు చెల్లదు: ట్రిబ్యునల్ తీర్పు

    భూమి కొనుగోలు చేయని సొసైటీపై RERA ఫిర్యాదు చెల్లదు: ట్రిబ్యునల్ తీర్పు

    భూమిని కొనుగోలు చేసి ప్రాజెక్ట్‌ను ప్రారంభించని సహకార సొసైటీపై RERA చట్టం కింద దాఖలైన ఫిర్యాదును విచారించే అధికారం లేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. సొసైటీ అభివృద్ధి కోసం భూమిని సేకరించకపోవడంతో ఎలాంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉనికిలోకి రాలేదని పేర్కొంది. సుప్రీంకోర్టు Newtech, బాంబే హైకోర్టు Macrotech తీర్పులను ట్రిబ్యునల్ ప్రస్తావించింది. RERA చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ అవసరమా, మినహాయింపు ఉందా అనే విషయాన్ని ముందుగా పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది.ఫిర్యాదుదారు డబ్బు రికవరీ కోసం సహకార సంఘాల రిజిస్ట్రార్ లేదా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించవచ్చని సూచించింది. సొసైటీ 6% వడ్డీతో డబ్బు తిరిగి చెల్లించేందుకు చేసిన ప్రతిపాదనను ఫిర్యాదుదారు అంగీకరించలేదు. చివరకు అప్పీల్‌ను కొట్టివేస్తూ ట్రిబ్యునల్ RERA ఉత్తర్వును సమర్థించింది.

    Kishore Arepalli Avatar
  • హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్డేట్

    హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్డేట్

    పర్ఫెక్ట్ లేఔట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు అసోసియేట్ మీటింగ్ ఉంది. మీటింగ్ లో కొత్త ప్రోజెక్టుల గురించి ప్రెసెంటేషన్ ఇవ్వడానికి పలువురు ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్లు వస్తున్నారు. మార్కెట్ లో ఉన్న ఏజెంట్ లు ఈ మీటింగ్ కు హాజరయ్యి కొత్త అవకాశాలను అందుకోవాలని CEO సతీష్ కుమార్ గారు తెలిపారు.

    Prop360 News Avatar