advertisement

తాజా వార్తలు

  • స్టూడియో అపార్ట్‌మెంట్ లేదా 1BHK.. ఏది ఎంచుకోవాలి?

    స్టూడియో అపార్ట్‌మెంట్ లేదా 1BHK.. ఏది ఎంచుకోవాలి?

    మెట్రో నగరాల్లో ఇల్లు కొనాలనుకునే వారికి స్టూడియో అపార్ట్‌మెంట్, 1BHK మధ్య ఎంపిక కీలకంగా మారుతోంది. స్టూడియో అపార్ట్‌మెంట్ సాధారణంగా చిన్న విస్తీర్ణంలో ఉండటంతో ధర, డౌన్ పేమెంట్, EMI తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులు, ఒంటరిగా నివసించేవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులు, మెట్రో స్టేషన్లు, కాలేజీలకు సమీపంలో ఉంటే అద్దె డిమాండ్ కూడా ఉండొచ్చు.మరోవైపు, 1BHKలో ప్రత్యేక బెడ్‌రూమ్ ఉండటంతో ప్రైవసీ, ఎక్కువ స్థలం లభిస్తుంది. వివాహం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి భవిష్యత్ అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. పెట్టుబడికి ముందు లొకేషన్, ధర, అద్దె డిమాండ్, నిర్వహణ ఖర్చులు, రీసేల్ అవకాశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

    Sandhya B Avatar
  • రూ.1.23 కోట్లకు ఇల్లు కొనుగోలు.. రూ.1.46 కోట్లకు పెరిగిన విలువ.. రూ.11.35 లక్షల పన్ను ఉపశమనం

    రూ.1.23 కోట్లకు ఇల్లు కొనుగోలు.. రూ.1.46 కోట్లకు పెరిగిన విలువ.. రూ.11.35 లక్షల పన్ను ఉపశమనం

    రూ.1.235 కోట్లకు ఆస్తి కొనుగోలుకు 2021లో ఒప్పందం చేసుకున్న ఓ మహిళకు Income Tax Appellate Tribunal (ITAT) కీలక ఉపశమనం కల్పించింది. ఒప్పంద సమయంలోనే ఆమె, భర్త కలిసి రూ.91 లక్షలను బ్యాంకింగ్ మార్గంలో చెల్లించారు. అయితే 2023లో రిజిస్ట్రేషన్ సమయానికి ఆస్తి స్టాంప్ డ్యూటీ విలువ రూ.1.462 కోట్లకు పెరిగింది. ఈ తేడాలో ఆమె వాటా రూ.11.35 లక్షలను ఆదాయంగా పరిగణించి పన్ను విధించారు. దీనిపై ఆమె ITATను ఆశ్రయించారు. ఒప్పంద తేదీ నాటి విలువను పరిగణించాల్సి ఉండగా, రిజిస్ట్రేషన్ తేదీ నాటి పెరిగిన విలువను తీసుకోవడం సరైంది కాదని ట్రైబ్యునల్ పేర్కొంది. దీంతో రూ.11.35 లక్షల పన్ను జోడింపును తొలగించింది.

    Sandhya B Avatar
  • తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. రూ.50 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేటు చేతుల్లోకి

    తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. రూ.50 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేటు చేతుల్లోకి

    రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు బదలాయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారుల వివరాల ప్రకారం, ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బొంగులూరు రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 96లో మొత్తం 4.36 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా ఉంది. అయితే 4.25 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై పట్టా చేసినట్లు సమాచారం. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమిని బదలాయించిన వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా పట్టా చేసిన అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

    Sandhya B Avatar
  • జపాన్‌లో భూకంప నిరోధక టెక్నాలజీ.. ఇల్లు నేలపై నుంచి లేచేలా!

    జపాన్‌లో భూకంప నిరోధక టెక్నాలజీ.. ఇల్లు నేలపై నుంచి లేచేలా!

    భూకంపాలు తరచుగా సంభవించే జపాన్‌లో ఇళ్లను రక్షించేందుకు కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే బేస్ ఐసోలేషన్, షాక్ అబ్జార్బర్లు, ప్రత్యేక పునాది నిర్మాణాలు వంటి టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. తాజాగా భూకంపం వచ్చినప్పుడు ఇల్లు నేల నుంచి పైకి లేచేలా చేసే సరికొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీలో సెన్సార్లు భూకంపం ప్రారంభాన్ని గుర్తిస్తాయి. ముఖ్యంగా P-వేవ్స్‌ను గుర్తించిన వెంటనే ప్రత్యేక వ్యవస్థ పనిచేసి ఇంటిని నేల నుంచి కొంత ఎత్తుకు లేపుతుంది. దీంతో భూమి కంపించినా భవనం నేరుగా ఆ కదలికలకు గురికాకుండా రక్షణ పొందుతుంది. భూకంపాల వల్ల ఇళ్లకు కలిగే నష్టాన్ని తగ్గించడంతో పాటు, ప్రజల భద్రతను పెంచేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

    Sandhya B Avatar
  • CURE Act: హైదరాబాద్ పాలనలో కీలక మార్పులు.. ప్రాపర్టీ ట్యాక్స్‌లో కొత్త విధానం

    CURE Act: హైదరాబాద్ పాలనలో కీలక మార్పులు.. ప్రాపర్టీ ట్యాక్స్‌లో కొత్త విధానం

    హైదరాబాద్ నగర పాలనలో కీలక మార్పులకు CURE Act 2026 శ్రీకారం చుడుతోంది. 1955 నాటి GHMC చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌ను GHMC, Cyberabad Municipal Corporation, Malkajgiri Municipal Corporationగా మూడు కార్పొరేషన్లుగా నిర్వహించనున్నారు.ప్రధానంగా ప్రాపర్టీ ట్యాక్స్ విధానంలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న Annual Rental Value విధానానికి బదులుగా Capital Value System ద్వారా ఆస్తి విలువ ఆధారంగా పన్ను లెక్కించనున్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తులకు ఈ విధానం 2027-28 నుంచి అమల్లోకి రానుండగా, పన్ను పెరుగుదలను ఏడాదికి గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేశారు.అలాగే ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజీ, వరదలు, చెరువులు, పర్యావరణం, బిల్డింగ్ పర్మిషన్లపై సమన్వయ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు.

    Sandhya B Avatar
  • జోరుగా స్థిరాస్తి వ్యాపారం.. పురపాలికకు ఆదాయం నాస్తి

    జోరుగా స్థిరాస్తి వ్యాపారం.. పురపాలికకు ఆదాయం నాస్తి

    ఖమ్మం జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్నా.. పురపాలికకు రావాల్సిన ఆదాయం మాత్రం సమకూరడం లేదు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో వందల సంఖ్యలో వెంచర్లు, వేలాది ఖాళీ స్థలాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2025 జనవరి 25న 12 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ఏదులాపురం మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 70 వేల ఖాళీ స్థలాలు ఉన్నట్లు సమాచారం. వీటిపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (VLT) విధిస్తే పురపాలికకు గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు అనేక ఖాళీ స్థలాలకు పన్ను అంచనా నమోదు కాలేదని తెలుస్తోంది. దీంతో లక్షల రూపాయల ఆదాయం కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఖాళీ స్థలాల వివరాలను నమోదు చేసి పన్ను వసూలు చేయాల్సిన అవసరం ఉంది.

    Sandhya B Avatar
  • వారసత్వంగా వచ్చే ఆస్తిపై 55 శాతం పన్ను?

    వారసత్వంగా వచ్చే ఆస్తిపై 55 శాతం పన్ను?

    భారత్‌లో వారసత్వంగా లభించే ఆస్తులపై 55 శాతం ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ విధించాలనే ప్రతిపాదన మరోసారి చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదనను సాబీర్ భాటియా ప్రస్తావించినట్లు సమాచారం. ఇలాంటి పన్ను అమలైతే తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వచ్చే ఇళ్లు, భూములు, ఇతర ఆస్తులపై పన్ను భారం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అధిక విలువైన ఆస్తులు కలిగిన ధనవంతులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని చర్చ జరుగుతోంది. మరోవైపు, మధ్యతరగతి కుటుంబాలకు వారసత్వంగా వచ్చే ఇల్లు లేదా భూమిపై పన్ను ఎలా వర్తిస్తుంది అన్నది కీలక అంశంగా మారుతుంది. అయితే ఇది ప్రస్తుతం ప్రతిపాదన మాత్రమే; అమల్లో ఉన్న పన్ను విధానం కాదు.

    Sandhya B Avatar
  • GMADA భూవ్యవహారాలపై ED దర్యాప్తు.. TDI PR-6 ప్రాజెక్టుపై ఫోకస్

    GMADA భూవ్యవహారాలపై ED దర్యాప్తు.. TDI PR-6 ప్రాజెక్టుపై ఫోకస్

    పంజాబ్‌లోని గ్రేటర్ మొహాలి ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (GMADA) భూవ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు విస్తరించింది. దాదాపు రూ.10,000 కోట్ల మేర అవకతవకలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో TDI ఇన్‌ఫ్రాటెక్ కార్యాలయంలోనూ ED సోదాలు నిర్వహించింది. మొహాలీలోని PR-6 మాస్టర్ ప్లాన్ రహదారి కోసం భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై అధికారులు పత్రాలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలోని డేటాను పరిశీలించారు. సుమారు 6.557 ఎకరాల భూమి నోటిఫికేషన్ తర్వాత సంబంధిత వ్యక్తులకు బదిలీ చేయడం ద్వారా పరిహారం పెరిగే అవకాశం ఏర్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సుమారు రూ.6 కోట్ల అదనపు ప్రజాధన భారం ఏర్పడే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ED తుది నిర్ధారణ ఇంకా వెలువడలేదు.

    Sandhya B Avatar
  • గ్రామకంఠం భూములకు ఆస్తి హక్కులు.. 12 ఏళ్లు ఉంటే ఓనర్‌షిప్!

    గ్రామకంఠం భూములకు ఆస్తి హక్కులు.. 12 ఏళ్లు ఉంటే ఓనర్‌షిప్!

    తెలంగాణలో గ్రామకంఠం (ఆబాదీ) భూముల్లో నివసిస్తున్న వారికి చట్టబద్ధమైన ఆస్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత 12 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా ఇంట్లో నివసిస్తున్నట్లు ఆధారాలు చూపితే యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. ఇంటి పన్ను రశీదు, పొరుగువారి వాంగ్మూలం, స్వీయ ధ్రువీకరణ అఫిడవిట్ వంటి ఆధారాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. భూభారతి చట్టం కింద గ్రామకంఠం ఇళ్లు, ఖాళీ స్థలాలకు డిజిటల్ సర్వే నిర్వహించి ప్రాపర్టీ ఐడీలు కేటాయించనున్నారు. శాటిలైట్, డ్రోన్, GNSS సాంకేతికతతో సరిహద్దులను నమోదు చేస్తారు. సర్వే పూర్తయ్యాక ఆస్తి హక్కు పత్రాలు జారీ చేయనున్నారు. అభ్యంతరాల కోసం 21 రోజుల గడువు ఇవ్వనున్నారు.

    Sandhya B Avatar
  • అక్టోబర్ 1 నుంచి ఆస్తి కొనుగోలుపై TDS రూల్స్‌లో మార్పులు

    అక్టోబర్ 1 నుంచి ఆస్తి కొనుగోలుపై TDS రూల్స్‌లో మార్పులు

    ఆస్తి కొనుగోలుదారులకు అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త TDS నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా NRI నుంచి ఇల్లు, ఫ్లాట్ లేదా భూమి కొనుగోలు చేసే రెసిడెంట్ వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUF) ఇక TDS కోసం TAN తీసుకోవాల్సిన అవసరం లేదు. తమ PAN ఆధారంగా TDSను రిపోర్ట్ చేసి చెల్లించవచ్చు. ఇందుకోసం కొత్తగా Form 141 ద్వారా TDS వివరాలను సమర్పించాలి. అయితే కంపెనీలు, సంస్థలు NRI నుంచి ఆస్తి కొనుగోలు చేసినప్పుడు TAN నిబంధన కొనసాగుతుంది. అలాగే NRI విక్రేత ఉన్న లావాదేవీలకు రూ.50 లక్షల పరిమితి, 1% TDS రేటు వర్తించదు. వర్తించే TDSను లెక్కించి, మినహాయించి, నిర్దేశిత విధానంలో జమ చేయాలి.

    Sandhya B Avatar