లేటెస్ట్ సిటీ న్యూస్

  • సికింద్రాబాద్ వార్ మెమోరియల్ తరలింపు.. ఎలివేటెడ్ కారిడార్ కోసం కీలక నిర్ణయం

    సికింద్రాబాద్ వార్ మెమోరియల్ తరలింపు.. ఎలివేటెడ్ కారిడార్ కోసం కీలక నిర్ణయం

    సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని దశాబ్దాల నాటి వరల్డ్‌ వార్‌–2 వార్‌ మెమోరియల్‌ త్వరలో తరలించనున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌ సమీపంలోని జనరల్‌ చౌదరి రోడ్డుపై ఉన్న ఈ చారిత్రక స్మారకాన్ని జిమ్‌ఖానా గ్రౌండ్స్‌ నుంచి శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం మార్చాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 6న జరిగిన సమావేశంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు తరలింపునకు ఆమోదం తెలిపింది. సుమారు 5,800 చదరపు అడుగుల కంటోన్మెంట్‌ భూమిలో ఉన్న ఈ స్మారక చిహ్నం రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర సైనికుల జ్ఞాపకార్థం నిర్మించారు. కొత్త ప్రదేశం ఖరారైన తర్వాత అసలు స్మారకాన్ని తరలించకుండా, ఆధునిక హంగులతో ప్రతిరూపాన్ని నిర్మించే యోచనలో HMDA ఉన్నట్లు సమాచారం.

    Sandhya B Avatar

  • కేబీఆర్‌ పార్క్‌ రీ-డిజైన్‌పై అనుమానాలు

    కేబీఆర్‌ పార్క్‌ రీ-డిజైన్‌పై అనుమానాలు

    హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ట్రాఫిక్‌ నియంత్రణ కోసం చేపట్టనున్న రీ-డిజైన్‌ ప్రాజెక్టుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రతిపాదించిన ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లకు రూ.1,090 కోట్లుగా అంచనా వేయగా, వాటిని రద్దు చేసి నాగార్జున సర్కిల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వరకు 4.3 కిలోమీటర్ల ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ను ప్రతిపాదించారు. అయితే కొత్త ప్రాజెక్టుకూ అదే రూ.1,090 కోట్ల వ్యయాన్ని చూపడంపై విమర్శలు వస్తున్నాయి. కొత్త టెండర్లు లేకుండానే ఇప్పటికే ప్యాకేజీ-1లో పనిచేస్తున్న సంస్థకు పనులు అప్పగించడంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత పనుల కోసం చేసిన ఖర్చులు, రోడ్ల తవ్వకాలు, చెట్ల తొలగింపు తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

    Sandhya B Avatar

  • ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.948.65 కోట్లు

    ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.948.65 కోట్లు

    మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో నిర్మించనున్న శ్రీ ఓంకారేశ్వర ఆలయ సముదాయానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆలయ నిర్మాణానికి రూ.948.65 కోట్లు, ఆలయాన్ని కలిపే ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.159.62 కోట్లు కలిపి మొత్తం రూ.1,108.27 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.ఈ ఆలయ సముదాయంలో శ్రీ వీరభద్రుడు, భద్రకాళి, లలితా త్రిపురసుందరి, బాలగణపతి, బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయాలతో పాటు మహామండపం, రాజగోపురం, యాగశాల, పుష్కరిణి, భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గతంలో రూ.700 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టుకు తాజాగా నిధులు పెంచడం విశేషం.

    Sandhya B Avatar

  • ఫార్చ్యూన్ 99 హోమ్స్ నిర్వాహకుడు అరెస్ట్.. నకిలీ పత్రాలతో ప్లాట్ల మోసం

    ఫార్చ్యూన్ 99 హోమ్స్ నిర్వాహకుడు అరెస్ట్.. నకిలీ పత్రాలతో ప్లాట్ల మోసం

    హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఫార్చ్యూన్ 99 హోమ్స్ నిర్వాహకుడు మదిరాల రోసిరెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్చర్లలోని ఓ వెంచర్‌లో ప్లాట్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని నమ్మించి, రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అనంతరం ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా రోజులు గడుపుతూ బాధితుడిని మభ్యపెట్టాడు. అనుమానం వచ్చిన బాధితుడు పత్రాలను పరిశీలించగా, సదరు ప్లాట్‌పై రోసిరెడ్డికి ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని, చూపించిన డాక్యుమెంట్లు నకిలీవని గుర్తించాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో రోసిరెడ్డి కార్యాలయానికి తాళం వేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో అతడిని పట్టుకున్నారు. గతంలోనూ అతడిపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

    Sandhya B Avatar

  • హైదరాబాద్‌లో 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్.. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు!

    హైదరాబాద్‌లో 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్.. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు!

    హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రతిపాదించిన ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల ప్రణాళికను రద్దు చేసి, పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించింది.నాగార్జున సర్కిల్–ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు సుమారు 4.4 కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ నిర్మించే అవకాశం ఉంది. దీంతో పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు వాహనదారులకు సిగ్నల్ రహిత ప్రయాణం సులభం కానుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1 వైపు ప్రత్యేక ర్యాంప్ కూడా ప్రతిపాదించారు. కొత్త డిజైన్, వ్యయ అంచనాలను త్వరలో సిద్ధం చేయనున్నారు.

    Sandhya B Avatar

  • కూకట్‌పల్లి 286 ఎకరాల భూ వివాదం.. రూ.50 వేల కోట్ల ఆస్తిపై హక్కుల పోరు

    కూకట్‌పల్లి 286 ఎకరాల భూ వివాదం.. రూ.50 వేల కోట్ల ఆస్తిపై హక్కుల పోరు

    హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని సర్వే నంబర్‌ 1007లో ఉన్న 286 ఎకరాల భూమిపై దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. 1961లో ఏర్పాటైన భాగ్యనగర్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఈ భూమిలో ప్లాట్ల కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు సభ్యులు చెబుతున్నారు. కోర్టు ప్రక్రియ అనంతరం 1991–1998 మధ్య మొత్తం 167 ఎకరాలు సొసైటీ పేరుతో రిజిస్టర్‌ అయినట్లు సమాచారం. మిగిలిన 119 ఎకరాలపై హక్కుల వివాదం కొనసాగుతోంది.తమ స్థలాల్లో జోక్యం, ప్రహరీ నిర్మాణాలు, ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ 286 ఎకరాల భూమి విలువ ప్రస్తుతం సుమారు రూ.50 వేల కోట్ల వరకు ఉండొచ్చని వారు పేర్కొంటున్నారు. భూముల హక్కులపై వివిధ పక్షాల మధ్య న్యాయపోరాటం కొనసాగుతోంది.

    Sandhya B Avatar

  • హైదరాబాద్‌లో 4 కి.మీ ఎలివేటెడ్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్

    హైదరాబాద్‌లో 4 కి.మీ ఎలివేటెడ్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్

    హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో కీలక ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు 4 కి.మీ పొడవున ఈ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. పంజాగుట్టలోని ఎస్‌ఎన్‌ఎల్ సర్కిల్ వద్ద ప్రారంభమయ్యే ఈ కారిడార్ జూబ్లీహిల్స్ వైపు కొనసాగుతుంది. నగరంలోని ప్రధాన మార్గాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహనదారుల ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. సుమారు రూ.1,090 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టు పూర్తయితే పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడే అవకాశం ఉంది.

    Sandhya B Avatar

  • హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌.. బీబీనగర్‌, భువనగిరి, యాదాద్రిపై ఐటీ ఉద్యోగుల ఫోకస్

    హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నగర శివారు ప్రాంతాల వైపు విస్తరిస్తోంది. పశ్చిమ హైదరాబాద్‌లో పెరుగుతున్న ఇళ్ల, భూముల ధరల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులు బీబీనగర్‌, భువనగిరి, యాదాద్రి ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. తక్కువ బడ్జెట్‌లో ప్లాట్లు, భూములు లభించే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది.బీబీనగర్‌లో AIIMS, హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారి, రైల్వే కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి. భువనగిరి, యాదాద్రిలో పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలు అభివృద్ధికి దోహదపడుతున్నాయి. భవిష్యత్‌లో RRR, మెరుగైన రవాణా సదుపాయాలు రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.అయితే ప్లాట్‌ కొనుగోలు ముందు టైటిల్‌, లేఅవుట్‌ అనుమతులు, RERA, రోడ్డు కనెక్టివిటీ తప్పనిసరిగా పరిశీలించాలి.

    Sandhya B Avatar

  • ఫ్లాట్ ఇవ్వకుండా ఆరేళ్లు ఆలస్యం.. ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌కు TG RERA షాక్

    ఫ్లాట్ ఇవ్వకుండా ఆరేళ్లు ఆలస్యం.. ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్‌కు TG RERA షాక్

    హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనుగోలుదారుడికి తెలంగాణ RERA (TG RERA) కీలక తీర్పు ఇచ్చింది. శేరిలింగంపల్లి మండలంలోని ఆదిత్య క్యాపిటల్ హైట్స్ ప్రాజెక్టులో ఫ్లాట్ కోసం మోతిపల్లి వంశీధర్ 2018లో రూ.1.02 కోట్లకు ఒప్పందం చేసుకుని, రూ.85,55,367 చెల్లించారు. అయితే ఆరేళ్లు గడిచినా ఫ్లాట్ నిర్మించి అప్పగించకపోవడంతో ఆయన TG RERAను ఆశ్రయించారు. విచారణ అనంతరం, చెల్లించిన రూ.85.55 లక్షలను 10.75% వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని RERA ఆదేశించింది. మానసిక క్షోభ, ఫిర్యాదు ఖర్చుల కోసం అదనంగా రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని ఆదేశాల తేదీ నుంచి 60 రోజుల్లోపు చెల్లించాలని సంస్థకు గడువు విధించింది.

    Sandhya B Avatar

  • CURE Act: హైదరాబాద్ పాలనలో కీలక మార్పులు.. ప్రాపర్టీ ట్యాక్స్‌లో కొత్త విధానం

    CURE Act: హైదరాబాద్ పాలనలో కీలక మార్పులు.. ప్రాపర్టీ ట్యాక్స్‌లో కొత్త విధానం

    హైదరాబాద్ నగర పాలనలో కీలక మార్పులకు CURE Act 2026 శ్రీకారం చుడుతోంది. 1955 నాటి GHMC చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్‌ను GHMC, Cyberabad Municipal Corporation, Malkajgiri Municipal Corporationగా మూడు కార్పొరేషన్లుగా నిర్వహించనున్నారు.ప్రధానంగా ప్రాపర్టీ ట్యాక్స్ విధానంలో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న Annual Rental Value విధానానికి బదులుగా Capital Value System ద్వారా ఆస్తి విలువ ఆధారంగా పన్ను లెక్కించనున్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తులకు ఈ విధానం 2027-28 నుంచి అమల్లోకి రానుండగా, పన్ను పెరుగుదలను ఏడాదికి గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేశారు.అలాగే ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజీ, వరదలు, చెరువులు, పర్యావరణం, బిల్డింగ్ పర్మిషన్లపై సమన్వయ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు.

    Sandhya B Avatar