నేషనల్

  • హైరైజ్ అపార్ట్‌మెంట్లలో నీటి సమస్యలు.. కొనుగోలుదారులు జాగ్రత్త!

    హైరైజ్ అపార్ట్‌మెంట్లలో నీటి సమస్యలు.. కొనుగోలుదారులు జాగ్రత్త!

    హైరైజ్ అపార్ట్‌మెంట్లకు నగరాల్లో డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో నీటి సమస్యలు నివాసితులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎక్కువ అంతస్తులు, అధిక జనాభా కారణంగా రోజువారీ నీటి అవసరం భారీగా పెరుగుతోంది. బోర్‌వెల్స్‌పై ఆధారపడటం, భూగర్భ జలాల తగ్గుదల, ట్యాంకర్లపై ఆధారపడటం వంటి అంశాలు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి.కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం కారణంగా నివాసితులు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోంది. దీంతో హైరైజ్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే ముందు నీటి లభ్యత, బోర్‌వెల్ పరిస్థితి, మున్సిపల్ వాటర్ కనెక్షన్, ట్యాంకర్ అవసరం వంటి అంశాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో వాటర్ సెక్యూరిటీ కూడా రియల్ ఎస్టేట్‌లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది.

    Sandhya B Avatar
  • మధ్యతరగతి హౌసింగ్‌లో బిగ్ చేంజ్.. కాలనీలను వీడి గేటెడ్ కమ్యూనిటీలకు పరుగులు!

    మధ్యతరగతి హౌసింగ్‌లో బిగ్ చేంజ్.. కాలనీలను వీడి గేటెడ్ కమ్యూనిటీలకు పరుగులు!

    నగరాల్లో మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల ఎంపికలో మార్పు కనిపిస్తోంది. గతంలో కాలనీల్లో స్వతంత్ర ఇళ్లకు ప్రాధాన్యం ఇచ్చిన కుటుంబాలు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, విల్లాల వైపు ఆసక్తి చూపుతున్నాయి. భద్రత, పార్కింగ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పిల్లల ఆట స్థలాలు, క్లబ్‌హౌస్ వంటి సౌకర్యాలు ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, రవాణా సౌకర్యాలకు దగ్గరగా ఉండే ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోంది. నిర్వహణ సౌకర్యాలు, కమ్యూనిటీ జీవనశైలి కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో నగర రియల్ ఎస్టేట్ మార్కెట్లో గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

    Sandhya B Avatar
  • కరీంనగర్‌లో రిజిస్ట్రేషన్ పేరుతో మోసం.. రూ.29 లక్షలు కాజేసిన వ్యక్తి

    కరీంనగర్‌లో రిజిస్ట్రేషన్ పేరుతో మోసం.. రూ.29 లక్షలు కాజేసిన వ్యక్తి

    కరీంనగర్‌లో భూమి రిజిస్ట్రేషన్ పేరుతో ఓ మహిళను మోసం చేసి రూ.29 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తబస్సుమ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. శనిగరం శివారులోని 7 గుంటల భూమిని రూ.29 లక్షలకు విక్రయిస్తానని కృష్ణగిరికి చెందిన మహమ్మద్ అలీఫ్ 2025 డిసెంబర్ 23న తబస్సుమ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. రూ.5 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అనంతరం 2026 జూలై 14న తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆమెను రప్పించాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని నమ్మించి మిగిలిన రూ.24 లక్షలు కూడా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మోసం జరిగినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

    Sandhya B Avatar
  • అమరావతి ORR మాస్టర్‌ప్లాన్.. మూడు సొరంగాలు, రెండు భారీ వంతెనలు

    అమరావతి ORR మాస్టర్‌ప్లాన్.. మూడు సొరంగాలు, రెండు భారీ వంతెనలు

    అమరావతి రాజధాని ప్రాంతానికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాజెక్టుకు మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది. మొత్తం 189.93 కి.మీ. పొడవుతో ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. సుమారు రూ.30,491 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు.ORRలో మూడు సొరంగాలు, కృష్ణా నదిపై రెండు భారీ వంతెనలు నిర్మించనున్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో 2.68, 1.64 కి.మీ. సొరంగాలు, పేరేచర్ల వద్ద 400 మీటర్ల సొరంగం ఏర్పాటు కానుంది. అలాగే 4.8 కి.మీ., 3.15 కి.మీ. కృష్ణా వంతెనలు నిర్మించనున్నారు.ORR పూర్తయితే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీతో పాటు సరకు రవాణా, లాజిస్టిక్స్‌కు ప్రయోజనం కలగనుంది.

    Sandhya B Avatar
  • ఇళ్ల ధరలు పెరుగుతున్నాయ్.. Gen Zకు సొంతింటి కల ఎందుకు కష్టమవుతోంది?

    ఇళ్ల ధరలు పెరుగుతున్నాయ్.. Gen Zకు సొంతింటి కల ఎందుకు కష్టమవుతోంది?

    ఇల్లు కొనాలనుకునే Gen Zకు పెరుగుతున్న ధరలు సవాల్‌గా మారుతున్నాయి. పలు నగరాల్లో ఇళ్ల ధరలు ఆదాయాల కంటే వేగంగా పెరగడంతో సొంతింటి కల భారంగా మారుతోంది. 2025 తొలి అర్ధభాగంలో రూ.50 లక్షలలోపు ఇళ్ల వాటా కేవలం 17 శాతానికి పడిపోయింది.8.5% వడ్డీ, 20 ఏళ్ల హోమ్ లోన్, 80% లోన్-టు-వాల్యూ ఆధారంగా చూస్తే.. రూ.50 లక్షల ఇంటికి ఏడాదికి రూ.14–16 లక్షలు, రూ.75 లక్షల ఇంటికి రూ.21–24 లక్షలు, రూ.1 కోటి ఇంటికి రూ.28–32 లక్షల ఆదాయం అవసరమవుతుంది. డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. దీంతో యువత చిన్న ఇళ్లు, నగర శివారు ప్రాంతాలు లేదా జాయింట్ ఓనర్‌షిప్ వైపు చూస్తున్నారు.

    Sandhya B Avatar
  • సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ మోసాలు.. RERA హెచ్చరిక

    సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ మోసాలు.. RERA హెచ్చరిక

    సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలపై RERA అధికారులు అప్రమత్తమయ్యారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తక్కువ ధరకే ప్లాట్లు, విల్లాలు అంటూ ఆకర్షణీయమైన ప్రీలాంచ్ ఆఫర్లతో కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సరైన అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు లేకుండానే ప్రాజెక్టులను ప్రచారం చేసి ముందస్తు డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై నిఘా పెంచారు. నకిలీ రియల్ ఎస్టేట్ ప్రకటనలపై సైబర్ సెల్ సహకారంతో చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు సోషల్ మీడియా ప్రకటనలను గుడ్డిగా నమ్మకుండా, పెట్టుబడి పెట్టే ముందు ప్రాజెక్ట్‌కు సంబంధించిన RERA రిజిస్ట్రేషన్ నంబర్, అనుమతులను అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.

    Sandhya B Avatar
  • నవంబరు నెలాఖరులో హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ

    నవంబరు నెలాఖరులో హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ

    హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్‌-65 జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే పనులు నవంబరు చివరి నాటికి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. సుమారు 285.99 కిలోమీటర్ల మేర రూ.12,073.99 కోట్ల అంచనా వ్యయంతో ఈ విస్తరణ చేపట్టనున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైవే సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దసరా నాటికి ధర్మోజిగూడ, చిట్యాల ఫ్లైఓవర్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే సంక్రాంతి నాటికి మిగిలిన బ్లాక్‌ స్పాట్లలో ఫ్లైఓవర్‌ పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.

    Sandhya B Avatar
  • యూపీలో కొత్త రెంట్ రూల్.. రూ.20 లక్షల నుంచి రూ.26 వేలకు తగ్గిన ఖర్చు

    యూపీలో కొత్త రెంట్ రూల్.. రూ.20 లక్షల నుంచి రూ.26 వేలకు తగ్గిన ఖర్చు

    ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అద్దె, లీజ్ ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా తగ్గించింది. ముఖ్యంగా 10 ఏళ్ల వరకు ఉండే దీర్ఘకాలిక లీజులకు ఈ నిర్ణయం ప్రయోజనం కలిగించనుంది. గతంలో రూ.20 లక్షల వరకు ఉన్న ఖర్చు, కొత్త నిబంధనల ప్రకారం కొన్ని 10 ఏళ్ల లీజుల్లో కేవలం రూ.26,000కు తగ్గింది. వార్షిక అద్దె రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటే 10 ఏళ్ల ఒప్పందానికి స్టాంప్ డ్యూటీ రూ.13,000, రిజిస్ట్రేషన్ ఫీజు మరో రూ.13,000గా ఉంటుంది. దీంతో అద్దెదారులపై ప్రారంభ ఆర్థిక భారం తగ్గనుంది. దీర్ఘకాలిక అద్దె ఒప్పందాలు మరింత పెరిగి, అద్దె మార్కెట్‌లో పారదర్శకత, చట్టపరమైన స్పష్టత మెరుగుపడే అవకాశం ఉంది. అయితే ఈ మార్పుతో అద్దెలు నేరుగా తగ్గవు.

    Sandhya B Avatar
  • కిరాయి ఒప్పందం ముగిసినా ఖాళీ చేయని టెనెంట్.. రూ.3.27 కోట్ల చెల్లింపు

    కిరాయి ఒప్పందం ముగిసినా ఖాళీ చేయని టెనెంట్.. రూ.3.27 కోట్ల చెల్లింపు

    కిరాయి ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఆస్తిని ఖాళీ చేయకుండా కొనసాగిన టెనెంట్‌కు ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ మార్కెట్‌లోని ఆస్తికి సంబంధించిన కేసులో టెనెంట్ 2004 తర్వాత కూడా అక్కడే కొనసాగాడు. 2007లో భూస్వామి రూ.25 లక్షల రుణం తీసుకోవడంతో, రుణం పూర్తిగా చెల్లించే వరకు టెనెంట్ కొనసాగేందుకు అంగీకరించారు. ఈ రుణం 2012లో పూర్తిగా చెల్లించబడింది. ఆ తర్వాత కూడా 2017 వరకు ఆస్తిని ఖాళీ చేయకపోవడంతో, కోర్టు దాన్ని అనధికారిక ఆక్రమణగా పరిగణించింది. 2012 నుంచి 2017 వరకు మార్కెట్ రేటు ఆధారంగా రూ.3.27 కోట్ల మెస్నే ప్రాఫిట్స్ చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తంపై 6 శాతం వార్షిక వడ్డీ కూడా వర్తిస్తుంది.

    Sandhya B Avatar
  • అద్దెనా? సొంత ఇల్లా? యువ ఉద్యోగులు ఏది ఎంచుకోవాలి?

    అద్దెనా? సొంత ఇల్లా? యువ ఉద్యోగులు ఏది ఎంచుకోవాలి?

    యువ ఉద్యోగులు ఇల్లు కొనాలా? అద్దెకు ఉండాలా? అనే నిర్ణయం తీసుకునే ముందు ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించాలి. మరో 3–5 ఏళ్లలో ఉద్యోగం లేదా నగరం మారే అవకాశం ఉంటే అద్దెకు ఉండటం సౌకర్యవంతంగా ఉంటుంది. అదే నగరంలో 7–10 ఏళ్లు ఉండే అవకాశం, స్థిరమైన ఆదాయం ఉంటే ఇల్లు కొనడం పరిగణించవచ్చు. హోమ్ లోన్ EMIతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్, రిపేర్లు వంటి అదనపు ఖర్చులను కూడా లెక్కించాలి. నెలవారీ EMI సాధారణంగా టేక్-హోమ్ ఆదాయంలో 35–40 శాతానికి మించకుండా ఉండేలా చూసుకోవడం మంచిది.

    Sandhya B Avatar