advertisement

తాజా వార్తలు

  • రియల్ ఎస్టేట్‌లో RERAతో పారదర్శకత.. కానీ మరిన్ని సంస్కరణలు అవసరం

    రియల్ ఎస్టేట్‌లో RERAతో పారదర్శకత.. కానీ మరిన్ని సంస్కరణలు అవసరం

    రియల్ ఎస్టేట్ రంగంలో RERA అమలుతో పారదర్శకత, నమ్మకం పెరిగాయని CREDAI-NCR అధ్యక్షుడు విశాల్ గుప్తా తెలిపారు. అయితే, ఇళ్ల ధరలు అందుబాటులో ఉండాలంటే అనుమతుల్లో జాప్యం, రెగ్యులేటరీ కంప్లయన్స్, పన్నుల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా బిల్డింగ్ ప్లాన్ అనుమతులు, RERA రిజిస్ట్రేషన్లలో ఆలస్యం, హౌసింగ్ ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచుతోందని పేర్కొన్నారు. అలాగే నైపుణ్యం కలిగిన కార్మికులు, నాణ్యమైన కాంట్రాక్టర్ల కొరతతో నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. చౌకైన మూలధనం, భూమి లభ్యత, సులభమైన వ్యాపార విధానాలు పెరిగితే అఫోర్డబుల్ హౌసింగ్ సరఫరా మెరుగుపడుతుందని గుప్తా అన్నారు.

    Kishore Arepalli Avatar
  • చిన్న నగరాల వైపు రియల్ ఎస్టేట్ పరుగులు.. విశాఖ, నాగ్‌పూర్‌కు పెరుగుతున్న డిమాండ్

    చిన్న నగరాల వైపు రియల్ ఎస్టేట్ పరుగులు.. విశాఖ, నాగ్‌పూర్‌కు పెరుగుతున్న డిమాండ్

    భారత రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు విశాఖపట్నం, నాగ్‌పూర్ వంటి టైర్-2, టైర్-3 నగరాల్లోనూ ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. సీఐఐ, నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక ప్రకారం దేశంలోని 11 వర్ధమాన నగరాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఆకర్షణీయ ప్రాంతాలుగా మారుతున్నాయి. మెరుగైన రహదారులు, విమానాశ్రయాలు, ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి ఈ నగరాల వృద్ధికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. తక్కువ పెట్టుబడి వ్యయం, మెరుగైన కనెక్టివిటీ, పెరుగుతున్న ఉపాధి అవకాశాలతో నివాస, వాణిజ్య ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. రాబోయే కాలంలో టైర్-2 నగరాలు భారత రియల్ ఎస్టేట్ వృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

    Kishore Arepalli Avatar
  • రేరా రిజిస్ట్రేషన్‌కు ముందే బుకింగ్స్.. జనప్రియ ప్రాజెక్ట్స్‌కు రూ.32.17 లక్షల జరిమానా

    రేరా రిజిస్ట్రేషన్‌కు ముందే బుకింగ్స్.. జనప్రియ ప్రాజెక్ట్స్‌కు రూ.32.17 లక్షల జరిమానా

    రేరా రిజిస్ట్రేషన్ పూర్తికాకముందే ప్రాజెక్టుల్లో బుకింగ్స్ చేపట్టినందుకు జనప్రియ ప్రాజెక్ట్స్‌కు అధికారులు రూ.32.17 లక్షల జరిమానా విధించారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను రేరా నిబంధనలకు అనుగుణంగా నమోదు చేసిన తర్వాతే విక్రయాలు, బుకింగ్స్ చేపట్టాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్‌కు ముందే బుకింగ్స్ నిర్వహించినట్లు గుర్తించడంతో సంబంధిత సంస్థపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో RERA నిబంధనల అమలు, ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ ప్రాధాన్యత మరోసారి చర్చనీయాంశమైంది. కొనుగోలుదారులు ప్రాజెక్ట్ రేరా రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించిన తర్వాతే బుకింగ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

    Sandhya B Avatar
  • హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో వింత ట్రెండ్

    హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో వింత ట్రెండ్

    హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గుతున్నప్పటికీ ఇళ్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. క్రెడాయ్–క్రెమెట్రిక్స్ తాజా నివేదిక ప్రకారం, గత నాలుగేళ్లలో హైదరాబాద్‌లో నివాస గృహాల అమ్మకాలు 13 శాతం తగ్గాయి. అయితే సగటు ఇంటి ధర రూ.2 కోట్ల మార్కును దాటింది. ఐటీ రంగంలోని ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఎన్‌ఆర్‌ఐ పెట్టుబడిదారుల వేచి చూసే ధోరణి వంటి అంశాలు కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు భూముల ధరలు, నిర్మాణ వ్యయాలు పెరగడంతో ఇళ్ల ధరలు తగ్గడం లేదు. దీంతో హైదరాబాద్‌లో సొంతింటి కొనుగోలు మరింత ఖరీదుగా మారుతోంది.

    Sandhya B Avatar
  • పెరిగిన వైట్ కాలర్ జాబ్స్.. హైదరాబాద్‌లో 23% వృద్ధి

    పెరిగిన వైట్ కాలర్ జాబ్స్.. హైదరాబాద్‌లో 23% వృద్ధి

    దేశవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు ఆగస్టులో 14 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఉద్యోగ నియామకాలలో హైదరాబాద్ 23 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. నౌకరి.కామ్ నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో టెక్, ఐటీ, ఇంజినీరింగ్, బిజినెస్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే నగరంలో జాబ్ మార్కెట్ గణనీయంగా మెరుగుపడింది. బెంగళూరు, పుణె, ముంబై వంటి ప్రధాన నగరాల్లోనూ వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు పెరిగాయి. హైదరాబాద్‌లో పెరుగుతున్న ఐటీ కార్యకలాపాలు, కొత్త కంపెనీల విస్తరణ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) పెరుగుదల ఉద్యోగ మార్కెట్‌కు మద్దతు ఇస్తున్నాయి. దీంతో నగరంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు డిమాండ్ మరింత పెరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

    Sandhya B Avatar
  • నల్గొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంపై ఫోకస్

    నల్గొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడంపై ఫోకస్

    నల్గొండను ఆధునిక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నగరంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పలు అభివృద్ధి పనులను వేగంగా చేపట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, పట్టణ సుందరీకరణ, ఇతర మౌలిక వసతులను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టనున్నారు. నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

    Sandhya B Avatar
  • ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి రూ.140 కోట్లు

    ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి రూ.140 కోట్లు

    హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.140 కోట్లు మంజూరు చేసింది.ఫ్యూచర్‌ సిటీని ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడంతో పాటు మెరుగైన రహదారులు, కనెక్టివిటీ, పట్టణ సదుపాయాల కల్పనపై దృష్టి సారించనున్నారు. భవిష్యత్‌లో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను ఆకర్షించేలా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఫ్యూచర్‌ సిటీ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు, మౌలిక వసతులు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. హైదరాబాద్‌ భవిష్యత్‌ వృద్ధిలో ఫ్యూచర్‌ సిటీ కీలక ప్రాంతంగా మారనుంది.

    Sandhya B Avatar
  • రూ.37 కోట్లతో రేడియల్ రోడ్డు.. ఐటీ కారిడార్‌కు భారీ ఊరట

    రూ.37 కోట్లతో రేడియల్ రోడ్డు.. ఐటీ కారిడార్‌కు భారీ ఊరట

    హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు మరో కీలక రహదారి అందుబాటులోకి రానుంది. రూ.37 కోట్ల వ్యయంతో రేడియల్‌ రోడ్డు నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. గోపన్‌పల్లి నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) వరకు ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే భూసేకరణ, ఇతర పనులపై అధికారులు దృష్టి సారించారు. ఈ రోడ్డు పూర్తయితే ఐటీ కారిడార్‌లో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాలపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

    Sandhya B Avatar
  • కోకాపేట భూమి వేలం రద్దు.. మళ్లీ మొదటికి!

    కోకాపేట భూమి వేలం రద్దు.. మళ్లీ మొదటికి!

    హైదరాబాద్‌ కోకాపేట నియోపోలిస్‌ లేఅవుట్‌లోని ప్లాట్ నంబర్ 17లోని 4.59 ఎకరాల భూమి వేలం మళ్లీ వాయిదా పడింది. సింగిల్ బిడ్ మాత్రమే రావడంతో హెచ్‌ఎండీఏ వేలాన్ని రద్దు చేసింది. గతంలోనూ ఈ భూమికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో మరోసారి వేలం నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కోకాపేటలో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు, భారీ వాణిజ్య, నివాస ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ భూమి వేలంపై ఆసక్తి నెలకొంది.

    Sandhya B Avatar
  • కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే.. రూ.1,000 కోట్ల వరకు ఆదా!

    కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే.. రూ.1,000 కోట్ల వరకు ఆదా!

    హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు కొత్త పరిష్కారం ప్రతిపాదించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేటీఆర్ పార్క్ ఎంట్రెన్స్, రోడ్ నంబర్లు 2, 45, 82, 12, 10 ప్రాంతాల్లో నిర్మించాలనుకున్న ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లను రద్దు చేసే ప్రతిపాదన ఉంది. వాటికి బదులుగా ఒకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నారు. రీ-అలైన్‌మెంట్‌తో భూసేకరణ అవసరమయ్యే ఆస్తులు 453 నుంచి 100లోపుకు తగ్గే అవకాశం ఉంది. దీంతో భూసేకరణ వ్యయంలో భారీగా తగ్గుదలతో రూ.1,000 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

    Sandhya B Avatar