advertisement

తాజా వార్తలు

  • తెలంగాణ రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.7,575 కోట్లు

    తెలంగాణ రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.7,575 కోట్లు

    తెలంగాణ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్–ఆగస్టు) రూ.7,574.79 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఏప్రిల్‌లో రూ.1,413.66 కోట్లు, మేలో రూ.1,707.21 కోట్లు, జూన్‌లో రూ.1,389.15 కోట్లు, జూలైలో రూ.1,634.93 కోట్లు, ఆగస్టులో రూ.1,429.84 కోట్ల ఆదాయం వచ్చింది. 2026–27 వార్షిక బడ్జెట్ అంచనా రూ.19,540.54 కోట్లలో ఇప్పటికే 38.8% ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.6,216 కోట్లతో పోలిస్తే ఈసారి సుమారు రూ.1,359 కోట్ల పెరుగుదల నమోదైంది. ఈ గణాంకాలు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఆస్తి లావాదేవీలకు కొనసాగుతున్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయి.

    Sandhya B Avatar
  • ముంబైలో రూ.711 కోట్ల మెగా రియల్ ఎస్టేట్ డీల్

    ముంబైలో రూ.711 కోట్ల మెగా రియల్ ఎస్టేట్ డీల్

    ముంబై జుహులో ఏంజెల్ వన్ వ్యవస్థాపకుడు దినేష్ ఠక్కర్ భారీ విలాసవంతమైన నివాస ఆస్తిని కొనుగోలు చేయనున్నారు. జుహు తారా రోడ్డులోని ఈ మొత్తం రెసిడెన్షియల్ టవర్ విలువ రూ.711 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. 63,000 చదరపు అడుగుల RERA కార్పెట్ ఏరియాతో G+7 అంతస్తుల్లో ఈ టవర్ నిర్మాణం చేపట్టారు. చదరపు అడుగుకు సుమారు రూ.1.13 లక్షల చొప్పున ఈ లావాదేవీ జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం ఐదు టవర్లు, 50 విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. రెండు ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం గ్రాస్ డెవలప్‌మెంట్ విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ముంబైలో అల్ట్రా-లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌కు ఈ డీల్ నిదర్శనంగా నిలుస్తోంది.

    Sandhya B Avatar
  • కుప్పంలో కొత్త పరిశ్రమలకు భారీ పెట్టుబడులు

    కుప్పంలో కొత్త పరిశ్రమలకు భారీ పెట్టుబడులు

    కుప్పంలో కొత్త పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులకు భారీ పెట్టుబడులు రానున్నాయి. ఏపీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు సమక్షంలో కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (KADA) పలు సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. మనస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌తో పాటు కింబర్‌లైట్ కెమికల్స్ రూ.70 కోట్లు, నూట్రాజెనిక్ రూ.350 కోట్లు, పయనీర్ ఎక్స్‌ట్రాక్ట్స్ రూ.67 కోట్లు, ఎంగమ్ డెయిరీ ఫుడ్స్ రూ.150 కోట్లు, ప్లాంటెస్ హెల్త్‌కేర్ రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. మొత్తంగా రూ.662 కోట్ల పెట్టుబడులతో వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. కెమికల్స్, హెర్బల్ ఉత్పత్తులు, బొటానికల్ ఎక్స్‌ట్రాక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్‌కేర్, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో పెట్టుబడులతో కుప్పం వైవిధ్యమైన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.

    Sandhya B Avatar
  • హైదరాబాద్ రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శంకుస్థాపన

    హైదరాబాద్ రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శంకుస్థాపన

    హైదరాబాద్‌లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో కీలక ముందడుగు పడనుంది. రాయదుర్గం ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. మల్కం చెరువు వెనుక ఉన్న 2.85 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 480 ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ టవర్స్‌ నిర్మాణం పూర్తయితే ఎంపికైన లబ్ధిదారులకు మెరుగైన నివాస సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. శంకుస్థాపన కార్యక్రమానికి లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ నిర్మాణం హైదరాబాద్‌ నగరంలో అందుబాటు గృహాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే మరో ప్రాజెక్టుగా నిలవనుంది.

    Sandhya B Avatar
  • ఆంధ్రప్రదేశ్‌లో రూ.22,177 కోట్ల పెట్టుబడులు.. 28 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం

    ఆంధ్రప్రదేశ్‌లో రూ.22,177 కోట్ల పెట్టుబడులు.. 28 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం

    ఆంధ్రప్రదేశ్‌లో 28 పారిశ్రామిక ప్రాజెక్టులకు రూ.22,177 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19,739 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.మచిలీపట్నంలో Goa Shipyard Limited రూ.8,000 కోట్లతో ప్రాజెక్టు, పల్నాడులో My Home Industries రూ.3,000 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో MVR Terravant JV రూ.3,078 కోట్లు, చిత్తూరులో RaoVax Agritech రూ.1,388.14 కోట్లు, విజయనగరం, తిరుపతిలో Hindustan Coca-Cola Beverages రూ.1,127 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. విశాఖపట్నంలో Deloitte, తిరుపతిలో Grand Tirupati Hotels & Resorts, కుప్పంలో MAF Clothing ప్రాజెక్టులు కూడా ఆమోదం పొందాయి. తయారీ, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, షిప్‌బిల్డింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో ఈ ప్రాజెక్టులు రానున్నాయి.

    Sandhya B Avatar
  • అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు

    అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు

    అమరావతి అభివృద్ధిపై 66వ CRDA అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల స్పియర్ టవర్, లిఫ్టుల నిర్మాణానికి రూ.661 కోట్లు కేటాయించారు. 29 గ్రామాల్లో LPS జోన్ల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,548 కోట్ల టెండర్లకు ఆమోదం తెలిపారు. రెండో దశ భూ సమీకరణలో ఎకరాలోపు భూమి ఉన్న రైతులకు వార్షిక పరిహారం చెల్లింపులు కొనసాగించే ప్రతిపాదన చేశారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలను అనుసంధానించే సమగ్ర ప్రజా రవాణా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. అమరావతిని మెగా సిటీగా అభివృద్ధి చేయడంతో పాటు 50% పచ్చదనం, జీవవైవిధ్యం ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

    Sandhya B Avatar
  • అమరావతి: భారతదేశపు ప్రముఖ నాలెడ్జ్ హబ్‌గా ఎదుగుతున్న నగరం

    అమరావతి: భారతదేశపు ప్రముఖ నాలెడ్జ్ హబ్‌గా ఎదుగుతున్న నగరం

    అమరావతి వేగంగా భారతదేశంలోని ప్రముఖ విద్యా, నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. VIT-AP, SRM యూనివర్సిటీ, అమృత విశ్వ విద్యాపీఠం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.రాబోయే రోజుల్లో XLRI, BITS, IIULER, NIELIT, NVIDIAతో AI యూనివర్సిటీ/లివింగ్ ల్యాబ్స్, మణిపాల్ గ్రూప్ మీడియా యూనివర్సిటీ, CITD, సివిల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్, KIMS, అమరావతి స్కూల్ ఆఫ్ బయోడిజైన్ వంటి సంస్థలు రానున్నాయి. వివిధ రంగాల్లో ప్రముఖ విద్యాసంస్థలు ఏర్పడటంతో అమరావతి విద్య, పరిశోధన, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలకు కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది.

    Sandhya B Avatar
  • రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కొత్త అవకాశాలు.. మంగళవారం పర్ఫెక్ట్ లేఔట్ అసోసియేట్ మీటింగ్

    రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కొత్త అవకాశాలు.. మంగళవారం పర్ఫెక్ట్ లేఔట్ అసోసియేట్ మీటింగ్

    హైదరాబాద్‌లోని పర్ఫెక్ట్ లేఔట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక అసోసియేట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 4 ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన ప్రొక్యూర్మెంట్ పార్ట్నర్లు పాల్గొని తమ కొత్త ప్రాజెక్టులను ప్రెజెంట్ చేయనున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ప్రాపర్టీ కన్సల్టెంట్లు ఈ సమావేశం ద్వారా కొత్త ప్రాజెక్టులు, సేల్స్ అవకాశాలు, ప్రాజెక్ట్ వివరాలు మరియు మార్కెట్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదనంగా, డిజిటల్ మార్కెటింగ్‌పై ప్రత్యేక శిక్షణ, ప్రాపర్టీ అడ్వైజర్ ప్రయోజనాలు, రివార్డులు, బిజినెస్ ఎక్స్‌పాన్షన్ మరియు గ్రోత్ స్ట్రాటజీలపై అవగాహన కల్పించనున్నారు. మార్కెట్‌లో ఉన్న ఏజెంట్లు సమావేశానికి హాజరై కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని పర్ఫెక్ట్ లేఔట్ CEO సతీష్ కుమార్ తెలిపారు. తమ స్నేహితులు, బంధువులు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఎదగాలనుకునే వారిని కూడా ఆహ్వానించాలని సూచించారు.

    Kishore Arepalli Avatar
  • కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్‌ పనులు 70% పూర్తి

    కడప విమానాశ్రయ కొత్త టెర్మినల్‌ పనులు 70% పూర్తి

    కడప విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌ భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ.266 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం 70 శాతం పూర్తయ్యాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆధునిక టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను 2023 అక్టోబర్‌లో ఆహ్వానించారు. 2024 మార్చి 10న శంకుస్థాపన జరగగా, ఏప్రిల్‌ 2024లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొత్త టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే కడప విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యాలు, మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయి.

    Sandhya B Avatar
  • మామునూరు విమానాశ్రయానికి మరో కీలక అడుగు

    మామునూరు విమానాశ్రయానికి మరో కీలక అడుగు

    మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. 2028 నాటికి విమాన సర్వీసులు ప్రారంభించాలనే లక్ష్యంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పనులను వేగవంతం చేస్తోంది. రన్‌వే ఆధునికీకరణ, పార్కింగ్, ట్యాక్సీవేలు, రహదారులు వంటి పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. తాజాగా నూతన డొమెస్టిక్ టెర్మినల్, ఏటీసీ టవర్, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్‌స్టేషన్ తదితర మౌలిక వసతుల కోసం మరో టెండర్ ప్రక్రియ చేపట్టారు. డిసెంబరులో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు విమాన కనెక్టివిటీ మెరుగుపడటంతోపాటు వరంగల్‌లో పెట్టుబడులు, పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలకు ఊతం లభించనుంది.

    Sandhya B Avatar