తాజా వార్తలు
-
హైరైజ్ అపార్ట్మెంట్లలో నీటి సమస్యలు.. కొనుగోలుదారులు జాగ్రత్త!
హైరైజ్ అపార్ట్మెంట్లకు నగరాల్లో డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో నీటి సమస్యలు నివాసితులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎక్కువ అంతస్తులు, అధిక జనాభా కారణంగా రోజువారీ నీటి అవసరం భారీగా పెరుగుతోంది. బోర్‌వెల్స్‌పై ఆధారపడటం, భూగర్భ జలాల తగ్గుదల, ట్యాంకర్లపై ఆధారపడటం వంటి అంశాలు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి.కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా అంతరాయం కారణంగా నివాసితులు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోంది. దీంతో హైరైజ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసే ముందు నీటి లభ్యత, బోర్వెల్ పరిస్థితి, మున్సిపల్ వాటర్ కనెక్షన్, ట్యాంకర్ అవసరం వంటి అంశాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో వాటర్ సెక్యూరిటీ కూడా రియల్ ఎస్టేట్‌లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది.
-
మధ్యతరగతి హౌసింగ్‌లో బిగ్ చేంజ్.. కాలనీలను వీడి గేటెడ్ కమ్యూనిటీలకు పరుగులు!
నగరాల్లో మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల ఎంపికలో మార్పు కనిపిస్తోంది. గతంలో కాలనీల్లో స్వతంత్ర ఇళ్లకు ప్రాధాన్యం ఇచ్చిన కుటుంబాలు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు, విల్లాల వైపు ఆసక్తి చూపుతున్నాయి. భద్రత, పార్కింగ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, పిల్లల ఆట స్థలాలు, క్లబ్‌హౌస్ వంటి సౌకర్యాలు ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, రవాణా సౌకర్యాలకు దగ్గరగా ఉండే ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోంది. నిర్వహణ సౌకర్యాలు, కమ్యూనిటీ జీవనశైలి కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో నగర రియల్ ఎస్టేట్ మార్కెట్లో గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
-
కరీంనగర్లో రిజిస్ట్రేషన్ పేరుతో మోసం.. రూ.29 లక్షలు కాజేసిన వ్యక్తి
కరీంనగర్లో భూమి రిజిస్ట్రేషన్ పేరుతో ఓ మహిళను మోసం చేసి రూ.29 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తబస్సుమ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. శనిగరం శివారులోని 7 గుంటల భూమిని రూ.29 లక్షలకు విక్రయిస్తానని కృష్ణగిరికి చెందిన మహమ్మద్ అలీఫ్ 2025 డిసెంబర్ 23న తబస్సుమ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. రూ.5 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అనంతరం 2026 జూలై 14న తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆమెను రప్పించాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని నమ్మించి మిగిలిన రూ.24 లక్షలు కూడా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మోసం జరిగినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
-
అమరావతి ORR మాస్టర్‌ప్లాన్.. మూడు సొరంగాలు, రెండు భారీ వంతెనలు
అమరావతి రాజధాని ప్రాంతానికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాజెక్టుకు మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది. మొత్తం 189.93 కి.మీ. పొడవుతో ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. సుమారు రూ.30,491 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు.ORRలో మూడు సొరంగాలు, కృష్ణా నదిపై రెండు భారీ వంతెనలు నిర్మించనున్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో 2.68, 1.64 కి.మీ. సొరంగాలు, పేరేచర్ల వద్ద 400 మీటర్ల సొరంగం ఏర్పాటు కానుంది. అలాగే 4.8 కి.మీ., 3.15 కి.మీ. కృష్ణా వంతెనలు నిర్మించనున్నారు.ORR పూర్తయితే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీతో పాటు సరకు రవాణా, లాజిస్టిక్స్‌కు ప్రయోజనం కలగనుంది.
-
హైదరాబాద్‌లో మళ్లీ ఊపందుకున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. 22-A నిషేధిత జాబితాలో ఉన్న ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 40 రోజుల మందగమనానికి తెరపడింది. రాజేంద్రనగర్, గండిపేట్, మొజాంజాహీ మార్కెట్, చాంపాపేట్, కీసర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. ఆస్తులపై 22-A జాబితా ప్రభావం ఉందా అనే వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. సేల్ అగ్రిమెంట్ల సంఖ్య కూడా పెరిగిందని డాక్యుమెంట్ రైటర్లు తెలిపారు. పితృపక్షం ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు పెరగడం గమనార్హం. అక్టోబర్ 11 నుంచి నవరాత్రులు ప్రారంభం కానుండటంతో దసరా సమయంలో హైదరాబాద్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.
-
ఇళ్ల ధరలు పెరుగుతున్నాయ్.. Gen Zకు సొంతింటి కల ఎందుకు కష్టమవుతోంది?
ఇల్లు కొనాలనుకునే Gen Zకు పెరుగుతున్న ధరలు సవాల్‌గా మారుతున్నాయి. పలు నగరాల్లో ఇళ్ల ధరలు ఆదాయాల కంటే వేగంగా పెరగడంతో సొంతింటి కల భారంగా మారుతోంది. 2025 తొలి అర్ధభాగంలో రూ.50 లక్షలలోపు ఇళ్ల వాటా కేవలం 17 శాతానికి పడిపోయింది.8.5% వడ్డీ, 20 ఏళ్ల హోమ్ లోన్, 80% లోన్-టు-వాల్యూ ఆధారంగా చూస్తే.. రూ.50 లక్షల ఇంటికి ఏడాదికి రూ.14–16 లక్షలు, రూ.75 లక్షల ఇంటికి రూ.21–24 లక్షలు, రూ.1 కోటి ఇంటికి రూ.28–32 లక్షల ఆదాయం అవసరమవుతుంది. డౌన్ పేమెంట్, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. దీంతో యువత చిన్న ఇళ్లు, నగర శివారు ప్రాంతాలు లేదా జాయింట్ ఓనర్షిప్ వైపు చూస్తున్నారు.
-
సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ మోసాలు.. RERA హెచ్చరిక
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలపై RERA అధికారులు అప్రమత్తమయ్యారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తక్కువ ధరకే ప్లాట్లు, విల్లాలు అంటూ ఆకర్షణీయమైన ప్రీలాంచ్ ఆఫర్లతో కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సరైన అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు లేకుండానే ప్రాజెక్టులను ప్రచారం చేసి ముందస్తు డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై నిఘా పెంచారు. నకిలీ రియల్ ఎస్టేట్ ప్రకటనలపై సైబర్ సెల్ సహకారంతో చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు సోషల్ మీడియా ప్రకటనలను గుడ్డిగా నమ్మకుండా, పెట్టుబడి పెట్టే ముందు ప్రాజెక్ట్‌కు సంబంధించిన RERA రిజిస్ట్రేషన్ నంబర్, అనుమతులను అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.
-
నవంబరు నెలాఖరులో హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ
హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్-65 జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించే పనులు నవంబరు చివరి నాటికి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. సుమారు 285.99 కిలోమీటర్ల మేర రూ.12,073.99 కోట్ల అంచనా వ్యయంతో ఈ విస్తరణ చేపట్టనున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని హైవే సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దసరా నాటికి ధర్మోజిగూడ, చిట్యాల ఫ్లైఓవర్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే సంక్రాంతి నాటికి మిగిలిన బ్లాక్ స్పాట్లలో ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
-
టెన్నిస్ వదిలి రియల్ ఎస్టేట్‌లోకి.. $500తో ప్రారంభించి రూ.100 కోట్ల ఆస్తులు!
డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మాజీ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రెస్ బెర్నాల్ తన కెరీర్‌ను రియల్ ఎస్టేట్ వైపు మళ్లించి భారీ ఆస్తులు సంపాదించాడు. అమెరికాకు కేవలం 500 డాలర్లతో వచ్చిన బెర్నాల్.. రెండేళ్లు ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడిన తర్వాత కోచ్‌గా పనిచేశాడు. ఆర్థిక స్వాతంత్ర్యం కోసం రియల్ ఎస్టేట్‌లోకి అడుగుపెట్టిన ఆయన, 2016లో తొలి ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం అమెరికాలోని కనెక్టికట్‌లో 60కి పైగా రెంటల్ యూనిట్లు, ఇందులో మల్టీఫ్యామిలీ ఇళ్లు, డ్యూప్లెక్స్‌లు, సింగిల్-ఫ్యామిలీ ప్రాపర్టీలు ఉన్నాయి. స్టూడెంట్ రెంటల్స్‌తో పాటు 22 సెక్షన్-8 యూనిట్లను కూడా నిర్వహిస్తున్నాడు. 2024-25 మధ్య 50కి పైగా ప్రాపర్టీలను ఫ్లిప్ చేసిన బెర్నాల్ ఆస్తుల విలువ 12 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.100 కోట్లు) ఉన్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.చిన్న పెట్టుబడితో ప్రారంభించి రియల్ ఎస్టేట్‌లో భారీ సంపద సృష్టించిన ఈ ప్రయాణం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
-
NRI నుంచి ప్రాపర్టీ కొనుగోలు మరింత సులభం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
NRI నుంచి ప్రాపర్టీ కొనుగోలు చేసే భారతీయ రెసిడెంట్ వ్యక్తులు, HUFలకు అక్టోబర్ 1, 2026 నుంచి TDS నిబంధనలు సులభతరం కానున్నాయి. ఇప్పటివరకు TDS కోసం ప్రత్యేకంగా TAN తీసుకోవాల్సి ఉండగా, ఇకపై తమ PANతోనే TDS చెల్లింపు, రిపోర్టింగ్ చేయవచ్చు. ఇందుకోసం సవరించిన Form 141లో కొత్త Schedule Eను ఉపయోగించాలి. అయితే NRIకి ప్రాపర్టీ కొనుగోలుపై TDS మినహాయింపు మాత్రం ఉండదు. కొనుగోలుదారు వర్తించే TDSను కట్ చేసి ప్రభుత్వానికి జమ చేయాలి. అనంతరం NRI విక్రేతకు Form 132 TDS సర్టిఫికెట్ ఇవ్వాలి. కొత్త విధానంతో ప్రాపర్టీ కొనుగోలుదారులకు TAN తీసుకునే అదనపు ప్రక్రియ తగ్గనుంది.












